అయ్యన్నపాత్రుడు ఆయన తనయుడు రాజేష్ కు బెయిల్ మంజూరు అయింది. గురువారం సాయంత్రం విశాఖ కోర్ట్ లో వారిద్దరిని ఏపీ సిఐడి పోలీసులు ప్రవేశపెట్టారు. ఏపి సిఐడి పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్, అయ్యన్న తరపు లాయర్ వాదనలు విన్న మెజిస్ట్రేట్ అయ్యన్నకు విధించిన రిమాండ్ ను కొట్టి వేస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. అయ్యన్నను అరెస్టు చేసిన కేసులో సెక్షన్ 467 వర్తించదని మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు. 41ఏ నోటీసులు ఇచ్చిన తరువతే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. అయ్యన్నకు బెయిల్ మంజూరయిందని తెలియడంతో కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.