గ్రంథాలయంలో బుక్ రీడింగ్

167చూసినవారు
గ్రంథాలయంలో బుక్ రీడింగ్
నర్సీపట్నం శాఖ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ క్లబ్ లో ఆదివారం బుక్ రీడింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థులతో విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను చదివించారు. అనంతరం మహానీయుల జీవిత చర్చలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక శాఖ గ్రంథాలయ అధికారి రాజబాబు నారికేళ మాట్లాడుతూ విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించేందుకు ప్రత్యేకంగా గ్రంథాలయంలో చిల్డ్రన్ క్లబ్ ఏర్పాటు చేసి ప్రతీ ఆదివారం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్