తప్పు చేస్తే బిసి నాయకుడిని అరెస్టు చేయరా

19549చూసినవారు
తప్పు చేస్తే బిసి నాయకుడిని అరెస్టు చేయకూడదా అని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కుల శవ రాజకీయాలను చేస్తుందని ఆరోపించారు. గురువారం ఆయన నర్సీపట్నం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇరిగేషన్ స్థలం రెండు సెంట్లు ఆక్రమించుకుని కట్టుకున్న ఇంటికి సంబంధించి తప్పుడు డాక్యుమెంట్లు హైకోర్టులో సమర్పించిన నేరానికి ఆయనను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇంతే కాకుండా నోటి దురుసు కారణంగా అయ్యన్నపాత్రుడిపై మొత్తం 12 కేసులు నమోదై ఉన్నాయన్నారు. ఈ అరెస్టును రాజకీయం చేయొద్దన్నారు. వైసిపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్