బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే 109 కు సమాచారం ఇవ్వాలని నర్సీపట్నం సివిల్ జడ్జి సియాజ్ ఖాన్ సూచించారు. బుధవారం జడ్జి నర్సీపట్నంలో పలు పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు అనవసరమైన విషయాల జోలికి పోవద్దన్నారు. చదువుపైనే దృష్టి పెట్టాలన్నారు. చదువుకున్న పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.