నర్సీపట్నంలో ప్రజా సంకల్ప వేడుకలు

3399చూసినవారు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న సమయంలో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఒక చరిత్ర సృష్టించిందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని నర్సీపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేడుకలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి ప్రజా ప్రతినిధులు నాయకులకు తినిపించారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల కష్టాలు సమస్యలను స్వయంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి వాటి పరిష్కారం కోసమే నవరత్నాలను మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపల్ పర్సన్ గుదిబండ ఆదిలక్ష్మి, గొలుగొండ జడ్పిటిసి గిరిబాబు, మాకవరపాలెం ఎంపీపీ రుత్తల సత్యనారాయణ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్