నర్సీపట్నం శాఖ గ్రంధాలయంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ క్లబ్ ద్వారా విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు స్థానిక శాఖ గ్రంథాలయ అధికారి ఎన్. రాజబాబు తెలిపారు. ఆదివారం గ్రంధాలయంలో పిల్లలకు చిత్ర లేఖన పోటీలు నిర్వహించారు. అలాగే బుక్ రీడింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి రాజబాబు మాట్లాడుతూ పిల్లలు ప్రతిరోజు ఒక గంట సమయాన్ని గ్రంథాలయాల్లో గడపాలనారు. ముఖ్యంగా గ్రంథాలయంలో విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను పిల్లలు చదవాలన్నారు. పిల్లలకు చదువుతోపాటు విజ్ఞానం కూడా అవసరమన్నారు.