నర్సీపట్నం ఆర్టీవో కార్యాలయంలో రీజినల్ ట్రాన్స్పోర్ట్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఎన్ రమేష్, స్పీకర్ అయ్యన్నపాత్రుడుని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో నర్సీపట్నం పరిధిలో రోడ్ సేఫ్టీ వాహనాల ఇన్సూరెన్స్ సంబంధిత రికార్డులపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని స్పీకర్ సూచించారు. ప్రత్యేకంగా, యువతలో రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు స్థానిక కాలేజీల్లో అవగాహన కల్పించాలన్నారు.