గొలుగొండలో విద్యార్థిని విద్యార్థులకు మండల స్థాయి ఆటల పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలో మండలానికి చెందిన 8 ఉన్నత పాఠశాలల విద్యార్థులతో పాటు కస్తూరిబా విద్యాలయానికి చెందిన విద్యార్థినులు పాల్గొంటున్నారు. కబడ్డీ, వాలీబాల్, రింగ్ టెన్నిస్, అథ్లెటిక్స్ తదితర పోటీలు మూడు రోజులు పాటు జరుగుతాయని మండల విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ పోటీల్లో విజేతలు నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని అన్నారు.