నర్సీపట్నం: అంకితభావంతో పనిచేయాలి
నర్సీపట్నంలో సీపీఐ జిల్లా శాఖ కార్యదర్శిల వర్క్ షాప్ సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు అంకితభావం పనిచేయాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 26 తేదీలోపు పార్టీ సభ్యత్వాలు పూర్తి కావాలని సూచించారు. ప్రతి నెల సమావేశమై పోరాటాలపై కార్యచరణ రూపొందించుకోవాలన్నారు.