గొలుగొండ: సాగులో ఉన్నవారికి హక్కు కల్పించాలి

68చూసినవారు
గొలుగొండ మండలం పాతమల్లంపేట పంచాయతీ గదబపాలెం రెవెన్యూ పరిధిలో సాగులో ఉన్న గిరిజనులకు హక్కు కల్పించాలని ఏపీ ఆదివాసీ సంఘం గౌరవ సలహాదారు అజయ్ కుమార్ కోరారు. సోమవారం తహశీల్దార్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. గదబపాలెం రెవెన్యూలో 850 సర్వే నంబర్ భూముల్లో సాగులో ఉన్న గిరిజనులకు సాగు హక్కు కల్పించక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తక్షణమే సాగు భూములకు హక్కు కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్