ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న జీపు.. ముగ్గురికి తీవ్ర గాయాలు

15912చూసినవారు
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న జీపు.. ముగ్గురికి తీవ్ర గాయాలు
విశాఖ ఏజెన్సీ జి. మాడుగుల మండలం సూరిమెట్ట మద్దిగురువు మధ్యలో ద్విచక్రవాహనాం-జీపు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా మారింది.
విశాఖ జిల్లా జి. మాడుగుల మండలం సూరిమెట్ట మద్దిగరువు మధ్యలో మంగళవారం ద్విచక్రవాహనాన్ని ప్రయివేటు జీపు ఢీకొంది. పెదబయలు మండలం బొంగరం పంచాయతీ చిట్రకాయపుట్టు గ్రామానికి చెందిన బూడిదే రాంబాబు, అతని భార్య పుష్ప, బావమరిది దేవదాసు జి. మాడుగుల వారపుసంతకు వస్తుండగా సూరిమెట్ట సమీపంలో ప్రయివేటు జీపు ఢీకొంది. ఈ ఘటనలో బూడిదే రాంబాబు కుడి కాలు, చేయి విరిగిపోగా, భార్య పుష్పకు నడుము విరిగిపోయింది. వీరితో ప్రయాణిస్తున్న దేవదాసు కుడి కాలు విరిగిపోయింది.

క్షతగాత్రులను పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించగా రాంబాబు పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన విశాఖ కేజీహెచ్ కు తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్