లాక్‌డౌన్‌తో పనుల్లేక ఆర్ధిక ఇబ్బందులు పడుచున్న రిక్షా కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 వేలు చొప్పున ఆర్ధిక సహాయం చేసి ఆదుకోవాలని కోరుతూ రిక్షా కార్మికుల యూనియన్ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో నక్కపల్లి తహశీల్దార్ కార్యాలయంవద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఎం.అప్పలరాజు మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా ప్రజా రావాణా స్తభించటంతో రిక్షా కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్ధికంగా ఇబ్బందులు పడుచున్నారన్నారు. వీరందరినీ ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై వుందని, తక్షణమే రిక్షా కార్మికలను ఆదుకోవాలంటూ అప్పలరాజు డిమాండ్ చేసారు. అనంతరం తహశీల్దార్ వి.వి రమణకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి రాజేష్, బుచ్చియ్య, వెంకన్న, అప్పారావు, నాగేశ్వరరావుతోపాటు పలువురు రిక్షా కార్మికులు పాల్గొన్నారు.