కర్రలతో తాత్కాలిక వంతెన నిర్మాణం చేసుకున్న గిరిజనులు

82చూసినవారు
అల్పపీడన ద్రోణి ప్రభావంతో గూడెంకొత్తవీధి మండలంలోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో మండలంలోని పలు మారుమూల గ్రామాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే మండలంలోని సప్పర్ల పంచాయతీ పరిధి సువపల్లి గ్రామానికి వెళ్లే వాగు పొంగి ప్రవహిస్తుండడంతో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటూ కర్రలతో తాత్కాలిక వంతెన నిర్మాణం చేపట్టి ఆదివారం రాకపోకలు కొనసాగించారు. వంతెన సమస్యపై అధికారులు స్పందించాలంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్