అరకులోయ మండలంలోని పద్మాపురం పంచాయతీ పరిధి పద్మావతి బొటానికల్ గార్డెన్ కు వెళ్లే రహదారిపై గురువారం రాత్రి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంచాయతీలోని కాఫీ చాక్లెట్ ఫ్యాక్టరీ నిర్వాహకుడు రహదారిపైనే వాహనాలు పార్కింగ్ ఏర్పాటు చేయడంతో రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఈ సమస్య పై సంబంధిత అధికారులు స్పందించి ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.