విశాఖ డెయిరీ అరిలోవలో 7. 95 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిందని రెవెన్యూ శాఖకు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈమేరకు గురువారం భీమిలి ఆర్డీఓ స్పందించారు. విశాఖ డెయిరీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ఆ భూమికి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్లతో వ్యక్తిగతంగా భీమిలి ఆర్డీవో కార్యాలయంలో హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.