భీమిలి: బకాయి జీతాలు చెల్లించాలని ధర్నా

84చూసినవారు
భీమిలి: బకాయి జీతాలు చెల్లించాలని ధర్నా
మూడు నెలల జీతాలు విడుదలచేయాలని డిమాండ్‌ చేస్తూ మధురవాడ జోన్‌ -2 కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యాన జివిఎంసి ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, డైలీ వేజ్‌ కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జోనల్‌ కమిషనర్‌ పి. సింహాచలానికి వినతిపత్రం అందించారు. ఈ ధర్నానుద్దేశించి సిఐటియు మధురవాడ జోన్‌ ఉపాధ్యక్షులు డి. అప్పలరాజు మాట్లాడుతూ కష్టపడి పనిచేస్తున్న కార్మికులను పస్తులు పెట్టడం అన్యాయమన్నారు.

సంబంధిత పోస్ట్