వైసీపీ శ్రేణులు ఓటమికి కృంగిపోకుండా ప్రజల మద్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సూచించారు. భీమిలి క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సోమవారం సాయంత్రం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా తను సంప్రదించవచ్చునన్నారు.