విశాఖ వైసిపి కార్యాలయంలో పలువురు పార్టీ నాయకులు గురువారం ఉత్తరాంధ్ర పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ విజయసాయి రెడ్డితో భేటీ అయ్యారు. భేటీ అయిన వారిలో నగర మేయర్ హరి వెంకట కుమారి, ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ పర్సన్ సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, అనకాపల్లి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, నగర డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్ తదితరులు ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.