భీమిలి నియోజకవర్గం లోని ఆనందపురం మండలం గిడిజాల, తంగుడుబిల్లి, జగన్నాధపురం తదితర గ్రామాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన లేఅవుట్లను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండి రాజబాబు బుధవారం పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన గృహ నిర్మాణాలు జియో ట్యాగింగ్ లబ్ధిదారుల వివరాలను అధికారులు ఎండికి తెలియజేశారు. ఎండి వెంట జిల్లా గృహ నిర్మాణ శాఖ ఈఈ సత్యనారాయణ, డీఈలు ఉన్నారు.