ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ డే 2024 ను విశాఖ అపోలో హాస్పిటల్స్ లో సోమవారం సంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ లో ప్రీ మెచ్యూర్ బేబీలను, తల్లులను, కుటుంబ సభ్యులను ప్రత్యేక ఆరోగ్య సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే ప్రధానంగా జరిగింది. ప్రీ మెచ్యూర్ బేబీలను సమాజంలో కీలక సమస్యగా గుర్తించి, వారి ఆరోగ్య రక్షణ కోసం అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.