రావికమతం: మా భూములు దౌర్జన్యంగా దున్నేస్తున్నారు

75చూసినవారు
తమ భూములను స్థానికేతరులు దౌర్జన్యంగా దున్నేస్తున్నారంటూ రావికమతం మండలం కవగుంట గ్రామంలో సోమవారం జరిగిన రెవిన్యూ సదస్సులో డిప్యూటీ తాసిల్దార్ విఆర్ఓకి గిరిజనులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని కోరుతూ మెడలో ఉరితాళ్ళు వేసుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. ఈనెల 20వ తేదీలోగా సమస్య పరిష్కారం కాకపోతే రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్