వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం వడ్డాదిలో వెంకటేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులు గిరి ప్రదక్షిణ, తిరువీధోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు వెంకన్న కొండ చుట్టూ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ ఊరేగింపులో స్థానిక బృందం ప్రదర్శించిన కోలాట ప్రదర్శన విశేషంగా అలరించింది. గిరి ప్రదక్షిణలో భక్తులకు స్థానిక యువకులు ప్రసాదం, మజ్జిగ, తాగునీరు సమకూర్చారు.