
విశాఖ: మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి
మన సంస్కృతీ సాంప్రదాయాలు చాలా గొప్పవని, వాటికి మనం విలువ ఇచ్చి తప్పకుండా ఆచరించాలని రాజ్ మాతాజ్ చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ మీనాక్షి అనంతరాం పేర్కొన్నారు. శనివారం విశాఖలోనిఎంవిపి కాలనివిశాఖలోని ఎంవిపి కాలేజీ ఐఐఎఎం కళాశాల ఆవరణలో జరిగిన సంక్రాంతి వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మనదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరని, దాన్ని మనం, మన భవిష్య తరాలు తప్పనిసరిగా కొనసాగించాలన్నారు.