దేశాన్ని 2047 నాటికి అగ్రగామిగా నిలిపేందుకు ప్రదాని మోదీ కృషి చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. అన్ని రంగాల్లో పురోభివృద్ధిలో భారత్ ముందుందన్నారు. బుధవారం విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ప్రధాని మోదీ ప్రజల మనిషన్నారు. చంద్రబాబు విజన్ 2020 అంటే కొంతమంది ఎగతాళి చేశారన్నారు.