విశాఖ వీఎంఆర్‌డీఏ అభివృద్ధి పనులపై ఎంపీ శ్రీ భరత్ మంగళవారం వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో సమీక్షించారు. సంస్థ కమిషనర్ విశ్వనాథన్‌తో కలిసి వివిధ అంశాలపై చర్చించారు. విశాఖ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కాబట్టి భవిష్యత్తు తరాలు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని ఎంపీ సూచించారు.