దక్షిణకోస్తా రైల్వే జోన్కు పునాదిరాయి వేశామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బుధవారం విశాఖలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిలో రైల్వే జోన్ కీలకం కానుందని.. రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోందన్నారు. వ్యవసాయ, పర్యాటక రంగాలు ఊపందుకుంటాయని, రాష్ట్రంలో ఇప్పటికే 7 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాని, అమృత్ భారత్ కింద ఏపీలోని 70కి పైగా రైల్వేస్టేషన్లు ఆధునీకరణ చేయనున్నామన్నారు.