విశాఖలో బుధవారం సాయంత్రం నిర్వహించనున్న ప్రధాని మోదీ బహిరంగ సభకు భారీ జనసమీకరణ జరుగుతోంది. ఇప్పటికే ఏయూ ఇంజినీరింగ్ ప్రాంగణానికి భారీగా జనం చేరుకున్నారు. వారికి కేటాయించిన సీట్లలో ఆశీనులయ్యారు. మరికొద్ది సేపట్లో ప్రధాని విశాఖ చేరుకుంటారు. ఎయిర్ పోర్టునుంచి నేరుగా సిరిపురం చేరుకుని అక్కడ నుంచి రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్‌లో బహిరంగ సభలో మాట్లాడతారు.