విశాఖ ఉక్కుకు పూర్వ వైభవం తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్ బాబు అన్నారు. విశాఖలోని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ సాధనలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.