టిడిపిలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు

74చూసినవారు
విశాఖ రాజకీయాలు ఒక్కసారి హీట్ ఎక్కాయి. వైసిపికి గట్టి షాక్ తగిలింది. ముందుగా అనుకున్నట్టే వైసిపి కి చెందిన 14 మంది కార్పొరేటర్లు టిడిపిలో చేరిపోయారు. విశాఖ జిల్లా టిడిపి కార్యాలయంలో శనివారం వీరంతా పార్టీలో చేరారు. టిడిపి ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో వైసిపి కార్పొరేటర్లకు టిడిపి కండువాలు వేసి ఆహ్వానించారు. త్వరలోనే మేయర్ పీఠాన్ని చేజిక్కించుకునే విధంగా వ్యూహం పన్నుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్