మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని గాజువాక డిపో వద్ద అత్యంత భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. లంబోదర ట్రస్టు ఆధ్వర్యంలో బెల్లం కుందులతో 75 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. దీనికోసం 18 నుంచి 20 టన్నుల బెల్లం కుందులను వినియోగిస్తున్నట్లు లంబోదర ట్రస్టు ఛైర్మన్ మొల్లి గోవర్థన్ తెలిపారు. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆదివారం గోవర్థన్ తెలిపారు.