గాజువాక: కాంట్రాక్ట్ కార్మికుడి మృతి

58చూసినవారు
గాజువాక: కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఓ ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికుడు మహమ్మద్‌ గౌస్‌ (43) మృతి చెందాడు. పెదగంట్యాడ మండలం ఇస్లాంపేట ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ గౌస్‌ ఆర్‌ఎంహెచ్‌పి డిపార్ట్‌మెంట్‌ రైల్వే వ్యాగన్‌ వర్క్‌ ప్రాంతంలో రిపేర్లకు వెళ్లిన సందర్భంలో విద్యుత్‌ షాక్‌కు గురై మంగ‌ళ‌వారం మృతి చెందాడు. తోటి కార్మికులు ఇచ్చిన సమాచారం మేరకు స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం ఉక్కునగరం పోలీసులకు సమాచారం అందజేసింది.

సంబంధిత పోస్ట్