చెట్టుపై నుంచి పడి వెన్నెముక దెబ్బతిని గత 6నెలలుగా మంచానికే పరిమితమైన కల్లుగీత కార్మికుడు 76వ వార్డుకు చెందిన పీత రమణకు హైకోర్టు న్యాయవాది యాత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అండిబోయిన లక్ష్మి, పలువురు సంఘ నాయకులు శుక్రవారం బియ్యం, నిత్యవసర వస్తువులు, బట్టలు అందజేసారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి పెన్షన్ ఇన్సూరెన్స్ మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు.