గాజువాక: రహదారి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి

80చూసినవారు
గాజువాక: రహదారి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి
గాజువాక మండలం అగనంపూడి టోల్ ప్లాజా నుండి అగనంపూడి ప్రధాన కూడలి వరకు వెల్లె రహదారి పునర్నిర్మాణం జాప్యంతో ప్రమాదాలకు గురవుతున్నారని తక్షణం రోడ్డును పునరుద్ధరించాలి 79వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాడైన రోడ్లు పునర్నిర్మాణం చేయడం మంచిదే కానీ, జాతీయ రహదారి అధికారులు ఒక నిర్దిష్ట ప్రణాళిక లేకుండా తవ్వేసి వారం రోజులు కావస్తున్న ఇప్పటికే రహదారి నిర్మాణం పూర్తి చేయకపోవడం వలన అనేకమంది ప్రమాదాలకు గురి అవుతున్నారు. కావున తక్షణమే రహదారి పునర్మాణం చేయాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్