ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు

53చూసినవారు
ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు
స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి ఉత్సవాలు పెందుర్తి పరిధిలోని వాడ చీపురుపల్లి ఉపాధి హామీ కార్మికులతో సిఐటియు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగింది. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి. సత్యనారాయణ, ఉపాధి హామీ కార్మికులు పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి మాట్లాడుతూ. విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం ముందుండి ఉద్యమాలు నిర్వహించారన్నారు. గిరిజన ప్రాంతంలో గిరిజనుల హక్కుల కోసం ఉద్యమించి, దేశంకోసం ప్రాణాన్ని త్యాగం చేశారన్నారు. కాని నేడు అల్లూరి స్పూర్తికి విరుద్దంగా ప్రభుత్వాలు గిరిజనుల హక్కులు, చట్టాలను తుంగలోకి తొక్కుతున్నాయన్నారు. తమ హక్కుల కోసం రైతులు, గిరిజనులు, కార్మికులు పోరాడుతున్నారన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం సాధించడంలో అల్లూరి పాత్ర కీలకమని, అసలు సిసలైన దేశభక్తి కలిగిన అల్లూరి. బ్రిటీష్‌ పోలీస్‌ వారి ఆయుధాలను స్వాధీనం చేసుకొని అదే బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎదురొడ్డిన సింహస్వప్నమని కొనియాడారు. స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీష్‌ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యహరించిన వారు కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర ఉద్యోమ చరిత్రను చెరిపేందుకు ప్రయత్నం చేస్తున్నదని అన్నారు.

సంబంధిత పోస్ట్