గాజువాక నియోజకవర్గం అగనంపూడి పునరావాస కాలనీ పెదమడక శివారు కర్రివాని పాలెంలో ఉన్న శ్రీ సంతోషి ఉమామహేశ్వర దేవాలయం 28వ వార్షికోత్సవం పోస్టర్ని బలిరెడ్డి సత్యనారాయణ బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 28 సంవత్సరాలుగా ఆలయ కమిటీ చైర్మన్ దాసరి సన్యాసిరావు, గతంలో సంతోషిమాత జన్మదినోత్సవాలు, రాఖీ పండుగలు, కార్తిక మాసం శివరాత్రి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.