విశాఖ జిల్లా గాజువాక సమీపంలోని స్టీల్ ప్లాంట్ సిoటర్ ప్లాంట్ వద్ద కాలువలో పడి ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మంగళవారం ఉదయం స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు పెద్దగంట్యాడకు చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు అశోక్ రెడ్డిగా గుర్తించారు. ప్రమాదవశాత్తూ కాలువలో పడిపోయాడా? మరే కారణమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.