నక్కపల్లి మండలం న్యాయం పూడి గ్రామంలో బుధవారం కేంద్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖలకు చెందిన అనిల్ గైక్వాడ్ ఆధ్వర్యంలో కేంద్ర బృందం పర్యటించింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పథకాలపై ఆరా తీసింది. అనంతరం సచివాలయంలో శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. పలు శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ఎంపీడీవో సీతారామరాజు కేంద్ర బృందానికి వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి సచీదేవి పాల్గొన్నారు.