నర్సీపట్నంలో అంబేద్కర్ సామాజిక భవనాన్ని నిర్మించాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు నేతల నాగేశ్వరరావు శనివారం విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ, ఎస్టీ పథకాలను పునరుద్దరించాలని, ఎస్సీ కార్పొరేషన్ ను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలన్నారు. రాజ్యాంగ ఫలాలు పూర్తి స్థాయిలో అందరికీ చేరేలా కృషి చేయాలన్నారు. ఈ మేరకు లేఖను సీఎం చంద్రబాబుకు మెయిల్ ద్వారా పంపించినట్లు తెలిపారు.