కిటకిటలాడిన నర్సీపట్నం మార్కెట్

58చూసినవారు
వరలక్ష్మీ వ్రతం పురస్కరించుకొని గురువారం నర్సీపట్నంలో మార్కెట్ కిటకిటలాడింది. శుక్రవారం పూజకు కావలసిన సామాన్లు కొనుగోలు చేయడానికి వచ్చిన మహిళలతో మార్కెట్ రద్దీగా మారింది. మరో పక్క ఊహించిన విధంగా పువ్వుల ధరలు ఆకాశాన్ని అంటాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పూజ సామాన్ల రేట్లు భారీగా పెరిగాయని మహిళలు తెలిపారు. ట్రాఫిక్ రద్దీ లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్