విజయదశమి సందర్భాన్ని పురస్కరించుకొని నర్సీపట్నంలో నాటు కోళ్లకు డిమాండ్ ఏర్పడింది. విజయదశమి శనివారం కావడంతో ఆదివారం నాన్ వెజ్ ప్రియులు పండగ చేసుకుంటున్నారు. నర్సీపట్నం మార్కెట్ కు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నాటు కోళ్లను తీసుకువచ్చి రైతులు విక్రయిస్తున్నారు. సాధారణ రోజుల్లో రూ. 1000 ఉండే కోడి ధర ఆదివారం మార్కెట్లో రూ. 1200 కు పెరిగింది.