యూనివర్సిటీలలో బీఈడీ కోర్సు చేయాలనుకుంటున్న విద్యార్థులు ఏపీ ఎడ్ సెట్ ద్వారా ర్యాంక్ సాధించి ఒకటి, రెండవ కౌన్సిలింగ్లో సీట్లు పొందారు. కాని ర్యాంక్ వచ్చిన వారికీ కన్వీనర్ కోటాలో అడ్మిషన్ రానివారికి స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించి బీఈడీ అవకాశం కల్పించాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి యు. నాగరాజు శుక్రవారం ఏయూ వీసీకి వినతి పత్రం అందజేశారు.