పాడేరు మండలం వంజంగిలో ఓ యువకుడు కరెంట్ షాక్ తో బుధవారం మృతి చెందాడు. ఓ రిసార్టులో రేగం కిరణ్ అనే కార్మికుడు ఐరన్ నిచ్చెన తరలిస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి పడిపోయాడు. తోటి సిబ్బంది పాడేరు ఆసుపత్రికి తరలించగా సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువకుడిది పాడేరు మండలం డేగల వీధి.