శ్రమదానం చేపట్టిన రింతాడ ఉప సర్పంచ్

85చూసినవారు
శ్రమదానం చేపట్టిన రింతాడ ఉప సర్పంచ్
ప్రతి ఒక్కరూ శ్రమదానం చేయడం వల్ల గ్రామం పరిశుభ్రంగా మారుతుందని గూడెం కొత్త వీధి మండలం రింతాడ ఉపసర్పంచ్ సోమేష్ కుమార్ అన్నారు. రింతాడ పరిధి నూతిబంధ గ్రామంలో శుక్రవారం ఉదయం పరిశుభ్రతలో భాగంగా యువకులతో పాటు ప్రజలు గంట పాటు శ్రమదానం చేశారు. ఆ గ్రామ ఆవరణలో ఉన్న సిసి రోడ్ ఇరువైపులా, పాఠశాల, వాటర్ ట్యాంక్ చుట్టూ తుప్పలను తొలగించారు. ఈ కార్యక్రమంలో మురళి, యువకులు, ఆశ కార్యకర్త, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్