తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి పంటకు ఎకరానికి రూ. 50, 000 చొప్పున రైతులకు ప్రభుత్వం చెల్లించాలని ఏపీ రైతు సంఘం అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అప్పలరాజు డిమాండ్ చేశారు. గురువారం నక్కపల్లి మండలం మనబానివానిపాలెంలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు. వర్షాలకు పంట తడిచి మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టంతో పాటు పెట్టుబడి సాయం రైతులకు ప్రభుత్వం అందించాలని అప్పలరాజు అన్నారు.