మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని పలువురు టీడీపీ నేతలతో పాటు అభిమానులు కోరుతున్న విషయం తెలిసిందే. తాజాగా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారన్న ప్రచారంపై హోం మంత్రి అనిత స్పందించారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ ‘అంతా దైవేచ్చ. నుదుటిపై రాసి ఉన్నది ఎవరూ ఆపలేరు. లోకేశ్‌కు రాసిపెట్టి ఉందేమో చూద్దాం’ అని అన్నారు.