పరవాడ మండలం పెదముషిడివాడకు చెందిన 40 మంది జనసైనికులు, యువకులతో కలిసి పంచకర్ల యువసేన ఏర్పాటు అయింది. ఆదివారం వీరంతా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును కలిసి గ్రామ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు. దీనిపై ఆయన మాట్లాడుతూ 40 మందితో పంచకర్ల యువసేనను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. యువసేన ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.