పెందుర్తి మండలం ఎస్. ఆర్. పురం గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సోమవారం హాజరయ్యారు. మహిళలు ప్రదర్శించిన కోలాటాన్ని తిలకించారు. వారితో కలిసి కాసేపు కోలాటం ఆడారు. అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగమణి, జడ్పీటీసీ దేవి, బీజేపీ నియోజకవర్గం కన్వీనర్ రామునాయుడు పాల్గొన్నారు.