విశాఖ నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో నగర పరిధిలోని బార్ అండ్ రెస్టారెంట్, పబ్‌లలో సోమవారం రాత్రి పోలీసులు తనిఖీ నిర్వహించారు. మాదక ద్రవ్యాలు, అక్రమ కార్యకలాపాలు, ఇతర అసాంఘిక చర్యలను నిర్వీర్యం చేసేందుకు నగరంలోని 92బార్ అండ్ రెస్టారెంట్, పబ్‌లలో విస్తృత దాడులు జరిపారు. సుమారు 450 మంది సిబ్బందితో నిర్వహించిన దాడులులో నిబంధనలుపాటించని బార్ అండ్ రెస్టారెంట్లపై కేసులు నమోదు చేశారు.