బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మూడు రోజులుగా ఇళ్లకు పరిమితమైన విశాఖ ప్రజలు ఆదివారం బయటకు వచ్చారు. దీంతో ఆర్. కె బీచ్ లో సందర్శకుల తాకిడి పెరిగింది. కొంతమంది పిల్లలు ఇసుకలో ఇళ్లను నిర్మిస్తూ మరి కొంతమంది స్నానాలు చేస్తూ సందడి చేశారు. దీంతో బీచ్ ఏరియా మూడు రోజుల తర్వాత సందర్శకులతో కిటకిటలాడింది. 3రోజులుగా మూగబోయిన బీచ్ సందర్శకుల తాకిడికి కోలాహలంగా కనిపించింది.