విశాఖలోని 60 వార్డు ఉడాకాలనీ శ్రీహరిపురం ఎంఐజి 175 ఇంట్లో చోరీ జరిగిందని ఆదివారం మల్కాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు బాధితులు. కాగా కేవలం 24 గంటల వ్యవధిలో ఆ కేసును ఛేదించామని మల్కాపురం పోలీసులు బుధవారం తెలిపారు. బాధితుడు శివప్రసాద్ తన స్వగ్రామం వెళ్లి వచ్చేసరికి చోరీ జరిగిందన్నారు. 18 తులాల బంగారం, 50 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ ఎసిపి లక్ష్మణరావు తెలిపారు.